- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలకు ఉన్నతాధికారుల నియామకం.. ఆదేశాలు జారీ
ఏపీలో కొత్తగా ఏర్పాటైన రెండు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత అధికారులను నియమించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రెండు జిల్లాలకు ఉన్నత అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలకు కలెక్టర్, ఎస్పీ, జేసీలను నియమిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పోలవరం జిల్లాకు ఇన్ ఛార్జి కలెక్టర్ గా ఎ.ఎస్.దినేశ్ కుమార్, ఇన్ ఛార్జి ఎస్పీగా అమత్ బర్దర్, ఇన్ ఛార్జి జేసీగా తిరుమాని శ్రీపూజను నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే మార్కాపురం జిల్లా ఇన్ ఛార్జి కలెక్టరుగా పి.రాజాబాబు, ఇన్ ఛార్జి ఎస్పీగా వి. హర్షవర్ధన్ రాజు, ఇన్ ఛార్జి జేసీగా రోణంకి గోపాలకృష్ణను నియమిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన 2 జిల్లాలతో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది.






