- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం.. నోటిఫికేషన్ జారీ
by Naga Rani Yarlagadda |
ఏపీ ప్రభుత్వం తాజాగా మరిన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం తాజాగా మరిన్ని కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 5 బీసీ కులాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లకు నియమించిన ఛైర్మన్ల పేర్లను బీసీ సంక్షేమశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. భట్రాజు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వెంకటేశ్వరరాజు, పెరిక సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా వీరభద్రరావు, షేక్ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ముక్తార్, కుర్ని - కరికాల భక్తుల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మినప్ప, రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా శంకర్ రెడ్డిలను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరంతా రెండేళ్లపాటు ఆయా పదవుల్లో కొనసాగుతారని తెలిపింది.
Next Story






