- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తమ సేవా పతకాలు ప్రకటించిన ఏపీ సర్కార్
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఏపీ ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలను ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు గాను ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. ముఖ్యమంత్రి సీఎస్‌వో (Chief Security Officer) కె.మధుసూదన్ మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ డ్రైవర్ ఏవీఎస్ గిరిబాబు తన విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావానికి గాను ఉత్తమ సేవా పతకాన్ని అందుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ఈ పతకాలను ప్రకటిస్తుంది. విధుల్లో చూపిన చొరవ, ధైర్యసాహసాలు, నిబద్ధత ప్రాతిపదికన ఈ ఎంపిక జరుగుతుంది.
Next Story






