- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో భారీగా RMZ గ్రూప్ పెట్టుబడులు.. విశాఖలో GCC పార్కు ఏర్పాటుకు ఒప్పందం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడుల ఒప్పందం జరిగింది. RMZ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యానికి ఒప్పందం కుదుర్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడుల ఒప్పందం జరిగింది. RMZ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యానికి ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు సంవత్సరాల్లో రాష్ట్రంలో సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.80 వేల కోట్లకు పైగా) పెట్టుబడులు పెట్టేందుకు RMZ గ్రూప్ ముందుకు వచ్చింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం-2026 సందర్భంగా ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఐటీ & ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ - ఆర్‌ఎమ్‌జెడ్ గ్రూప్ చైర్మన్ సమక్షంలో ఈ కీలక ఒప్పందం జరిగింది.
డిజిటల్ మౌలిక వసతుల హబ్‌గా విశాఖ
ఈ భాగస్వామ్యం ద్వారా విశాఖపట్నాన్ని నెక్ట్స్ జనరేషన్ మిక్స్‌డ్-యూజ్, డిజిటల్ మౌలిక వసతుల హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే రాయలసీమలో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి బలమైన ఊతం ఇవ్వనున్నారు. విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్–1లో 50 ఎకరాల్లో GCC పార్క్, ఐటీ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. మొత్తం ఒక కోటి చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనుండగా, ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించనున్నారు. ఇదే ప్రాంతంలో దశలవారీగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరమవుతుందని అధికారులు తెలిపారు. ఇది ఏఐ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో పెద్ద ముందడుగుగా నిలవనుంది.
రాయలసీమలో భారీగా ఉపాధి అవకాశాలు
రాయలసీమలోని టేకులుడు ప్రాంతంలో సుమారు 1,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి చేయనున్నారు. దీనివల్ల తయారీ, గోదాములు, రవాణా రంగాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఐటీ, డేటా సెంటర్లు, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. వ్యాపార అనుకూల వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అధికారులు తెలిపారు. సింగిల్ విండో అనుమతులు, భూముల కేటాయింపు, సమయ పరిమిత అనుమతులతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
READ MORE .....






