- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీబీ సిండ్రోమ్‌పై.. ఏపీ సర్కారు అలర్ట్
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి వణికిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో మరణిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ రోజు ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై సమీక్ష నిర్వహించారు. హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసుల తీవ్రత, వైద్య సదుపాయాలు, చికిత్సపై సీఎం ఆరా తీశారు.వైద్య ఆరోగ్య శాఖ వారి లెక్కల ప్రకారం విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు, కాకినాడలో 4 కేసులు, గుంటూరు, విశాఖ జిల్లాలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఈ సిండ్రోమ్ కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో 45 ఏళ్ల కమలమ్మ అనే మహిళ మృతి చెందారు. అనధికారికంగా పదుల సంఖ్యలో కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆ వివరాలను వెల్లడించారు. ఈ ఇంక్షన్ ఒక్కొక్కటి రూ.20 వేలు ఉంటుందన్నారు. ఒక పేషెంట్‌కు రోజుకు ఐదు ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇలా ఐదురోజులు ఇంజక్షన్ వాడాలి. అంటే రోజుకు లక్ష .. ఐదురోజులకు ఐదు లక్షల రూపాలు ఖరీదు చేసే ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు రోగులు వస్తున్నారని తెలిపారు. దీనిని ఎన్టీఆర్ వైద్యసేవలో కూడా చేర్చామన్నారు. జీజీహెచ్‌లలో 740 ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గోడౌన్లలో 429 ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయని తెలిపారు.
విశాఖ కేజీహెచ్‌లో గులేరియా బారిన పడి ఎవరూ మృతి చెందలేదని సూపరింటెండెంట్శివానంద ఈ రోజు వెల్లడించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదన్నారు. గులియన్బారీ సిండ్రోమ్ లక్షణాలతో వచ్చే వారికోసం కేజీహెచ్‌లో ఓ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఐదు అనుమానిత కేసులు వచ్చాయన్నారు. అనుమానితుల నమూనాలు పరీక్షలు పంపామన్నారు.
గులియన్ బారే సిండ్రోమ్ అంటు వ్యాధి కాదని వైద్యులు చెబతున్నారు. రోగ నిరోధక వ్యవస్థలపై ఈ వాయధి దాటి చేస్తుంటన్నారు. ఇది సోకిన వారిలో కాళ్లు చేతుల బలహీనత, తిమ్మరి, పక్షవాతం వంటి లక్షణాలు కనపడతాయని చెబుతున్నారు. ప్రజలు భయాందోళనలు చెందవద్దని సూచిస్తున్నారు.






