Nara Lokesh: ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్

by Ramesh Naini |

ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Nara Lokesh: ఐదేళ్ల తర్వాత ఏపీకి రీన్యూ పవర్.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు వివరాలు అంటూ ట్వీట్ చేశారు. ఆయన చెప్పినట్లుగానే సరిగ్గా 9 గంటలకు రాబోయే భారీ పెట్టుబడిపై ఎక్స్ వేదికగా రివీల్ చేశారు. ఏపీలో రీన్యూ పవర్ రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి రీన్యూ పవర్ తిరిగి రావడం గర్వకారణమన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో రీన్యూ సంస్థ ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టబోతోందని ప్రకటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

రీన్యూ పవర్ రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడితో ఇంధన పునరుత్పాదక రంగంలో భారీ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. సోలార్ ఇంగాట్ & వాఫర్ తయారీ, గ్రీన్ హైడ్రోజన్ & గ్రీన్ మాలిక్యూల్స్ ఉత్పత్తి రంగాల్లో పూర్తి స్థాయి పెట్టుబడులు పెడుతోంది. విశాఖపట్నంలో జరుగుతున్న CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కి సంస్థ సీఈఓ సుమిత్ సిన్హా ఆయన బృందాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్ ఇదే..

Next Story