పీజీ వైద్యవిద్యలో ఏపీకి అదనంగా 36 సీట్లు మంజూరు

by Naga Rani Yarlagadda |

ఏపీలో వైద్యవిద్యలో పీజీ చేయాలనుకునే వారికి జాతీయ వైద్యమండలి (NMC) శుభవార్త చెప్పింది.

పీజీ వైద్యవిద్యలో ఏపీకి అదనంగా 36 సీట్లు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైద్యవిద్యలో పీజీ చేయాలనుకునే వారికి జాతీయ వైద్యమండలి (NMC) శుభవార్త చెప్పింది. పీజీ వైద్యవిద్యకు సంబంధించి అదనంగా 36 సీట్లు మంజూరు చేసింది. ఈ వివరాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ వైద్యకళాశాలలకు ఈ సీట్లు కేటాయించింది. ఏలూరు వైద్యకళాశాలకు 12, రాజమండ్రి 4, మచిలీపట్నం 8, నంద్యాల 4, విజయనగరం 8 చొప్పున సీట్లు మంజూరు చేసింది. కాగా.. ఆయా కళాశాలలకు NMC తొలివిడతలో 60 సీట్లు కేటాయించింది.

Next Story