- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ దివ్యాంగులకు అలర్ట్.. ఈ స్కీం దరఖాస్తు గడువు పెంపు
ఏపీలో ఉన్న దివ్యాంగులకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం 100% రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇచ్చేందుకు సిద్ధం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు బిగ్ అలర్ట్. దివ్యాంగులకు ఇస్తున్న త్రీ వీలర్ స్కూటర్ల ప్రక్రియ దరఖాస్తు గడవు పెంచుతూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న దివ్యాంగులకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం 100% రాయితీతో త్రీ వీలర్ స్కూటర్లను ఇచ్చేందుకు సిద్ధం అయింది. ఇందుకు సంబంధించి ఆన్లైన్ లో దరఖాస్తులు కూడా తీసుకుంటోంది. అయితే ఈ పథకం కింద ఉచితంగా త్రిచక్ర వాహనాలు కావాలనుకునే దివ్యాంగులు, నవంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ముందుగా ప్రకటన చేసింది.
అయితే ఆ గడువును మరో 5 రోజుల పాటు పెంచింది. నవంబర్ 30వ తేదీ వరకు ఈ పథకం కోసం అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ గడవు పెంచింది కూటమి ప్రభుత్వం. ఏపీలోని ఒక్కో జిల్లాకు 80 స్కూటర్ల చొప్పున మంజూరు చేయనుంది. అప్లై చేసుకునే దివ్యాంగులు 18 నుంచి 45 సంవత్సరాలు కచ్చితంగా ఉండాలి. అలాగే 70 శాతం వైకల్యం, సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే లబ్ధిదారులు పదవ తరగతి చదివితేనే ఈ పథకం కింద అర్హులవుతారు. https://apdascac.ap.gov.in ఈ వెబ్ సైట్ లో ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.






