- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Forensic lab: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం.. 90శాతం పూర్తి
పీ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణం.. 90శాతం పూర్తి హోమంత్రి వంగలపూడి అనిత ఎక్స్‌వేదికగా వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్( Ap forensic lab) పనులు శరవేగంగా సాగుతున్నాయని హోమంత్రి వంగలపూడి అనిత(Home minister Anitha) ఎక్స్‌వేదికగా వెల్లడించారు.ఈ రోజు విజయవాడలోని హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ జి.పాలరాజు (ఐజీ) హోంమంత్రి వంగలపూడి అనితగారిని మర్యాదపూర్వకంగా కలిశారు. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.400 కోట్ల అంచనాతో అమరావతిలోని తుళ్లూరులో (Tulluru) 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కార్యాలయ నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి కక్షగట్టి ఆపిన పనులను 6నెలల్లో 90శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రయోగశాల పనులూ చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు. 2017 డిసెంబరు 29న ఈ ల్యాబ్‌కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrabab naidu) చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని మూలన పడేసింది. పైగా మూడు రాజధానుల నిర్మాణం అంటూ మొత్తం అమరావతి పనులనే పక్కన పెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పనులను పున:ప్రారంభించింది. మొత్తం మూడు బ్లాక్‌లలో ఈ ల్యాబ్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం బ్లాక్ 1 నిర్మాణం పూర్తి కావస్తోంది. రెండో బ్లాక్పనులను కూడా ప్రారంభించగా.. దీనికి సంబంధించిన పిల్లర్ల పనులు జరుగుతున్నాయి. ఈ ల్యాబ్ నిర్మాణం పూర్తయితే దేశంలోనే 8వ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏపీలో ఉన్నట్లు అవుతుందని కూటమి ప్రభుత్వం చెబుతోంది. నేరస్తులను పట్టించడంలో ఇది కీలకంగా ఉండనుంది.






