ఏపీ ఫైబర్‌ నెట్‌ MD దినేష్‌ బదిలీ.. తక్షణమే అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-25 13:31:57  IST  )

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌(AP Fibernet MD Dinesh)‌ను బదిలీ చేసింది.

ఏపీ ఫైబర్‌ నెట్‌ MD దినేష్‌ బదిలీ.. తక్షణమే అక్కడ రిపోర్ట్ చేయాలని ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌(AP Fibernet MD Dinesh)‌ను బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దినేష్‌ను తక్షణమే జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఫైబర్ నెట్‌తో పాటు రియల్ టైమ్ గవర్నెన్స్‌ సీఈవో, గ్యాస్‌, డ్రోన్‌ కార్పొరేషన్ల బాధ్యతల నుంచి కూడా దినేష్‌ను రిలీవ్ చేసింది. ఇదిలా ఉండగా.. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ఫైబర్ నెట్ చైర్మన్(Chairman of AP Fiber Net) పదవికి, టీడీపీ(TDP) ప్రాథమిక సభ్యత్వానికి జీవిరెడ్డి(GV Reddy) రాజీనామా చేశారు.

ఈ మేరకు సోమవారం తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నానని.. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరబోనని లేఖలో పేర్కొన్నారు. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. నా మీద నమ్మకం, విశ్వాసంతో కీలకమైన బాధ్యతలను అప్పగించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ ముఖ్య నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో జీవిరెడ్డి పేర్కొన్నారు.

Next Story