- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Liquor case: నకిలీ మద్యం కేసు.. మరో నిందితుడు సుదర్శన్‌కు బెయిల్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మరో నిందితుడు సుదర్శన్‌కు ఊరట లభించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో మరో నిందితుడు సుదర్శన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో సుదర్శన్‌కు విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇబ్రహీంపట్నం, ములకలచెరువు కేంద్రాలుగా నకిలీ మద్యం తయారు చేసినట్లు సుదర్శన్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో, కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సెంథిల్ కస్టడీ పిటిషన్‌పై 19న విచారణ
రూ. 25 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడైన సెంథిల్ వ్యవహారంపై కూడా కోర్టులో విచారణ జరిగింది. సెంథిల్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోర్టును కోరగా, అదే సమయంలో సెంథిల్ తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.






