పండితులకు గుడ్ న్యూస్.. మూడు నెలల సంభావన అందజేత

by Vemula.Srinu Prasad |

పండితులకు ఏపీ దేవాదాయ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది...

పండితులకు గుడ్ న్యూస్.. మూడు నెలల సంభావన అందజేత
X

దిశ, వెబ్ డెస్క్: పండితులకు ఏపీ దేవాదాయ శాఖ(AP Endowment Department)గుడ్ న్యూస్ తెలిపింది. ఆగమ శాస్త్రం(Agama Shastra) చదివి వేదపారాయణ చేసే 599 మంది పండితుల(Scholars)కు మూడు నెలల సంభావన ఒకేసారి అందజేసింది. ఈ మేరకు రూ. 53.91 లక్షలను చెక్కు రూపంలో పంపిణీ చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి నెలకు రూ. 3 చొప్పున మంత్రి నారాయణ(Minister Narayana) అందజేశారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పుట్టిన రోజు సందర్భంగా నెల్లూరు(Nellore)లో మంత్రి ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. అనంతరం హోమానికి వచ్చిన 8 వేల మందికి చీరలు, పంచెలు, తిరుమల లడ్డూ(Tirumala Laddu)ను పంపిణీ చేశారు. తాము అధికారంలోకి వస్తే పండితులకు నిరుద్యోగ భృతి (సంభావన) అందిస్తామని చెప్పారు. ఈ మేరకు తాజాగా ఆ హామీని మంత్రి నారాయణ నెరవేర్చారు. దీంతో పండితులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపారు.

Next Story