- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకటో తేదీనే జీతాలు.. హ్యాపీనెస్‌లో ఉద్యోగులు
ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్చగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్చగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో వీరంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఐదేళ్లు పాటు సమర్థవంతంగా ప్రజా సేవ చేసినప్పటికి చిన్న, చిన్న కారణాలకు కూడా ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు పెద్దపీట వేయడంతో హ్యాపీగా పని చేసుకుంటున్నారు. పైగా ప్రతి నెల 1వ తేదీనే జీతాలు పడుతున్నాయి. ఉద్యోగులపై గత ప్రభుత్వం పెట్టిన 3500 కేసులను కూడా ప్రభుత్వం తొలగించింది. అలాగే పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.7,500 కోట్లను విడుదల చేసింది.
దీంతో ఉద్యోగులంతా స్వేచ్ఛగా పని చేసుకుంటున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ప్రమాణం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వంపై విద్యాసాగర్ ప్రశంసలు కురిపించారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులంతా స్చేచ్ఛగా, సమర్థవంతంగా ప్రజలకు నచ్చేలా పని చేసుకుంటున్నారని తెలిపారు.






