- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి నారా లోకేశ్
ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2024-25 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ కోసం రూ.1198 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసినట్లు వెల్లడించారు. వీటిలో బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కు రూ.258.23 కోట్లు, అదనపు నిధుల కింద రూ.477.77 కోట్లు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.365.07 కోట్లు, మైనారిటీ విద్యార్థులకు రూ.98.92 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి వివరంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది విద్యార్థులకు చదువులో ఆర్థిక భారం తగ్గుతుందని ఆశించారు. ఇకపై విద్యార్థుల చదువులకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకావని తల్లిదండ్రులు, విద్యార్థులకు హామీ ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పెండింగ్ బకాయిలను క్లియర్ చేసి.. భవిష్యత్ లో కూడా సకాలంలో సహాయం అందేలా చూస్తామన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదివితే ప్రభుత్వం ఎప్పుడూ తోడుంటుందని భరోసా ఇచ్చారు.






