ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం

by Naga Rani Yarlagadda |

ఏపీ విద్యాశాఖ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఒంటిపూట బడుల తేదీలు, సమయాలను ప్రకటించింది.

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒంటిపూట బడులపై కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: శీతాకాలం వెళ్లిపోయి.. ఎండల తీవ్రత పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఒంటిపూట బడుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు జరుగుతాయని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం 12.30 గంటలకు భోజనం అందిస్తారు. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని విద్యాశాఖ పేర్కొంది. అటు తెలంగాణలోనూ మార్చి 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.

Next Story