EAPCET: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు వాయిదా.. జులై 2న విడుదలయ్యే అవకాశం!

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల వాయిదా పడింది.

EAPCET: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు వాయిదా.. జులై 2న విడుదలయ్యే అవకాశం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాల విడుదల వాయిదా పడింది. సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తిస్థాయిలో రానందున, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఫలితాలను జులై 2న (గురువారం) ప్రకటించే అవకాశముంది.

మే 12 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 3.29 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 1నే ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే ఎప్‌సెట్‌ ర్యాంకింగ్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉండటంతో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, సీబీఎస్‌ఈ రివైజ్డ్‌ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు వేచిచూడటం వల్లే ఎప్‌సెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగినట్లు అధికారుల సమాచారం.

Next Story