AP DSC: రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

AP DSC: రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం.. సర్వం సిద్ధం చేసిన అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సీబీటీ విధానంలో ఈ నెల 30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ రెండు సెషన్ల వారీగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ పరీక్ష కావటంతో బయోమెట్రిక్ నమోదు, ఇతర ప్రక్రియలు ఉన్నందున అభ్యర్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

అదేవిధంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఎగ్జామ్ సెంటర్ వద్దకు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలని పేర్కొన్నారు. ఇక మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, స్టడీ మెటీరియల్ పరీక్షా కేంద్రం వద్దకు తీసుకురావడం నిషేధమని తెలిపారు. డీఎస్సీ పరీక్షకు గాను తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 137 కేంద్రాలు ఉండగా.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మెగా డీఎస్సీతో 16,347 పోస్టులు భర్తీ చేయనుండగా.. 3,36,305 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

Next Story