AP DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆయనే..! అధికారిక ఉత్తర్వులే ఆలస్యం

by Kema Shiva Kumar |

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha) నియమితులయ్యే అశకాశాలు ఉన్నాయి.

AP DGP: ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా ఆయనే..! అధికారిక ఉత్తర్వులే ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha) నియమితులయ్యే అశకాశాలు ఉన్నాయి. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (Vigilance and Enforcement) విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ నెల 31తో ప్రస్తుత డీజీపీ ద్వారక తిరుమల రావు (Dwaraka Tirumala Rao) పదవీ విరమణ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త డీజీపీగా సర్వీస్ పరంగా అందరి కంటే ముందు ఉన్న హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Guptha)ను నియమించబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అదేవిధంగా ద్వారక తిరుమల రావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీ (RTC MD)గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రైటైర్ అయ్యాక కూడా ఆయనను సీఎం చంద్రబాబు (CM Chandrababu) అదే పోస్టులో ఏడాది లేదా రెండేళ్ల పాటు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. కొత్త డీజీపీ నియామక ఉత్తర్వులు ఈనెల 30న వెలువడే అవకాశాలు ఉన్నాయి.

Next Story