- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఏరివేతపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు
మావోయిస్టుల ఏరివేతపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా మావోయిస్టు(Maoist) ఏరివేత కొనసాగుతోందని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా(AP DGP Harish Kumar Gupta) తెలిపారు. ఏవోబీ, రంపచోడవరం మన్య పరిసరాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మారేడుమిల్లి ఎన్ కౌంటర్(Maredumilli encounter), విజయవాడ(Vijayawada)లో భారీగా మావోయిస్టుల అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చారు. మారేడుమిల్లి ఎన్ కౌంటర్లలో పోలీస్ బలగాలు విజయం సాధించాయని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, టెక్ శంకర్ తో పాటు 13 మంది మావోయిస్టులు చనిపోయారని తెలిపారు. 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మావోయిస్టులందరూ లొంగిపోవాలని జూన్ లోనే పిలుపునిచ్చామని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు 2026, మార్చి కల్లా మావోయిస్టు రహిత దేశంగా మార్చుతామని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు






