- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
16 మంది ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ షాక్.. తన ఆఫీసులో ఉండాలని ఆదేశం
16 మంది ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు...

X
దిశ, వెబ్ డెస్క్: 16 మంది ఐపీఎస్‌లకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో వీరిని ఇటీవల బదిలీ చేశారు. కానీ పోస్టింగులు పెండింగులో పెట్టారు. హెడ్ కార్టర్స్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయితే వీరంతా అందుబాటులో లేకపోవడంతో డీజీపీ తిరుమలరావు సీరియస్ అయ్యారు. ఐపీఎస్‌లు పీఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, సునీల్ కుమార్‌తో పాటు కాంతి రాణా, అమ్మిరెడ్డి, రఘురామిరెడ్డి, విజయరావు, విశాల్ గున్ని, రిషాంత్ రెడ్డి, రవిశంకర్, పరమేశ్వర్ రెడ్డి, రఘువీరారెడ్డి, పాలరాజు, జుషువా, అన్బురాజన్, కృష్ణపటేల్‌కు మెమో జారీ చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకాలు చేయాలని మెమోలో పేర్కొన్నారు.
Next Story






