నటనలోనూ తనకు తానే సాటి... రఘురామ స్టెప్పులు వైరల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-03 11:54:30  IST  )

ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు స్టెప్పులతో సందడి చేశారు....

నటనలోనూ తనకు తానే సాటి... రఘురామ స్టెప్పులు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్టంరాజు(AP Deputy Speaker Raghuramakrishtham Raju) స్టెప్పులతో సందడి చేశారు. ‘భీమవరం బీట్’ సాంగ్‌(Bhimavaram Beat song)కు ఆయన డ్యాన్సు చేశారు. దీంతో స్టేజ్ దద్దరిల్లిపోయింది. డిప్యూటీ స్పీకర్ సందడి చేయడం చూసిన యువత ఉర్రూతలూగిపోయింది. త్రిపుల్ ఆర్.. త్రిపుల్ ఆర్ అంటూ కేరింతలు కొట్టింది. ఇదంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

సంక్రాంతి సంబరాల్లో సందడి..

స్థానిక ఎస్ఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు(Sankranti celebrations) నిర్వహించారు. ఈ సంబరాల్లో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పాల్గొన్నారు. అయితే సింగర్ స్మిత(Singer Smitha) రూపొందించిన ‘భీమవరం బీట్’ సాంగ్‌ను ఈ సందర్భంగా ఆయన రిలీజ్ చేశారు. అనంతరం ఈ పాటకు స్టేజ్‌పై ఉత్సాహంగా రఘురామ డ్యాన్స్ చేశారు. ఏపీ అసెంబ్లీని హుందాగా నడిపించడంలోనే కాదని, నటలోనూ తనకు తానే సాటి అంటూ పలువురు కితాబిచ్చారు. అయితే ‘భీమవరం బీట్’ పాటలోని కొన్ని సీన్స్‌లో స్వయంగా రఘురామకృష్ణంరాజు నటించడం విశేషం.

Next Story