- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP: జగన్‌కు బిగ్ షాక్.. త్వరలో ఉపఎన్నిక..!
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(AP Deputy Speaker Raghuramakrishnam Raju) సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందుల(Pulivendula)లో త్వరలో ఉప ఎన్నిక రాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు(Custodial Torture Case)కు సంబంధించి రఘురామకృష్ణంరాజు గుంటూరు జిల్లా కోర్టు(Guntur District Court)లో స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబు(Tulasibabu)పై రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
తులసిబాబు లాయర్‌గా నమోదు చేసుకోలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. న్యాయ సలహా కింద తులసిబాబుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చిందని చెప్పారు. లాయర్‌గా నమోదు కాకుండానే తులసిబాబుకు ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీనిపై సుప్రీంకోర్టు(Supreme Court)కు లేఖ రాస్తానని చెప్పారు. ఇక రాజకీయ ఉనికి కోసమే జగన్ ప్రతిపక్ష హోదా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. జగన్ అసెంబ్లీకి రావాలని, రాకపోతే త్వరలో పులివెందులలో ఉప ఎన్నిక ఖాయమని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.






