- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత మన్మోహన్‌సింగ్: పవన్ కల్యాణ్
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former Prime Minister of India Manmohan Singh) దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, యూజీసీ ఛైర్మన్‌గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల మన ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కిందని తెలిపారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Bharat mourns the demise of a great statesman, a visionary economist, a man of humility , intellect and a former Prime Minister, Padma Vibhushan Dr. Manmohan Singh Ji. His leadership transformed the nation’s trajectory. As Finance Minister under Prime Minister Sri PV Narasimha… pic.twitter.com/bxaAnIxvFD
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 26, 2024






