- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశానికి దసరా బహుమతి.. ఆసియా కప్ విజయంపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
యుద్ధంలోనే కాదు.. క్రికెట్ లోనూ భారత్ కు పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థే. ఆపరేషన్ సిందూర్ తర్వాత..

దిశ, వెబ్‌డెస్క్: యుద్ధంలోనే కాదు.. క్రికెట్ లోనూ భారత్ కు పాకిస్థాన్ చిరకాల ప్రత్యర్థే. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. టీమిండియా పాక్ పై విజయం సాధించి.. ఆసియా కప్ ను సొంతం చేసుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమిండియాపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం టీమిండియా విజయాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆసియా కప్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా మరోసారి సత్తా చాటిందన్న ఆయన.. తొమ్మిదోసారి కప్ టైటిల్ ను గెలుచుకోవడం, అది కూడా ఆపరేషన్ సిందూర్ తర్వాత దాయాది దేశంపై సాధించిన విజయం కావడంతో గర్వంగా ఉందన్నారు. టీమిండియాలోని అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కితాబిచ్చారు. ఇది దేశానికి ముందస్తు దసరా బహుమతి అని పేర్కొన్నారు. ఆసియా కప్ విజయాన్ని యావత్ దేశం సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పారు.
ఆసియా కప్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. ఇది దేశ క్రికెట్ చరిత్రలోనే సువర్ణాధ్యాయమన్నారు. పాక్ పై భారత్ విజయాన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారని, ప్రతి భారతీయుడు గర్వించదగిన విజయమని పేర్కొన్నారు.






