- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్రస్థాయికి వెళ్లండి: అధికారులకు పవన్ ఆదేశం
పోలవరం జిల్లా సమీప అటవీ ప్రాంతంలో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా(Polavaram District) సమీప అటవీ ప్రాంతం(Forest Area)లో పశువులపై పులి దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై అటవీ శాఖ ఉన్నతాధికారుల(Forest department officials)తో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, పులి( Tiger) సంచారంపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అటవీ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా హనుమాన్ బృందాలను రంగంలోకి దించి, వారిని నిరంతరం అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులే స్వయంగా వెళ్లాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పులి కదలికలను ఖచ్చితంగా పసిగట్టేందుకు సాంకేతికతను వాడుకోవాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. అత్యాధునిక డ్రోన్లు, కెమెరా ట్రాప్‌ల వంటి అధునాతన సాంకేతిక సహాయంతో అటవీ ప్రాంతాన్ని పర్యవేక్షించాలన్నారు. సరిహద్దు గ్రామాల్లో నిరంతర అప్రమత్తత ప్రకటిస్తూ, ప్రజలకు రక్షణ కల్పించేలా అటవీ శాఖ తక్షణ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు.






