ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌లకు పవన్, లోకేశ్ అభినందనలు

by Naga Rani Yarlagadda |

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ (AP BJP Chief PVN Madhav), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు..

ఏపీ, తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్‌లకు పవన్, లోకేశ్ అభినందనలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ (AP BJP Chief PVN Madhav), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు (Ramachander Rao) నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన ఎన్.రామచందర్ రావులు గతంలో శాస మండలి సభ్యులుగా ప్రజా సమస్యలపై తమ గళాన్ని బలంగా వినిపించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇరువురి అనుభవంతో తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ.. పీవీఎన్ మాధవ్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారని, ఎమ్మెల్సీగా యువత, నిరుద్యోగుల సమస్యల్ని సభలో ప్రస్తావించారన్నారు. రామచందర్ రావు కూడా ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University)లో విద్యార్థి నాయకుడిగా కీలకపాత్ర పోషించారని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story