- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తో ఏపీ డిప్యూటీ సీఎం భేటీ
పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషనుగా తీర్చిదిద్దాలని వినతి.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో (Ashwini Vishnav) భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని (Pithapuram) రైల్వే సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రధానంగా చర్చించారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట–ఉప్పాడ ప్రధాన రహదారిపై ఉన్న లెవల్ క్రాసింగ్ (Level Crossing) కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బందులను వివరించారు. సమస్యను పరిష్కరించేందుకు తక్షణమే రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా భావించే భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషనుగా అభివృద్ధి చేయాలన్నారు. కాకినాడ - పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానాన్ని మరింత పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దీనితో పాటు, పిఠాపురం మీదుగా వెళ్లే నాలుగు ముఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్లకు (నాగావళి, విశాఖ-షిర్డీ వంటివి) స్థానిక స్టేషన్‌లో స్టాప్ (Halt) కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర రైల్వే ప్రాజెక్టులు (Railway Projects), విశాఖ రైల్వే జోన్ పురోగతిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ 'పీఎం గతి శక్తి' (PM Gati Shakti) పథకం కింద ఈ ప్రాజెక్టులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీ ద్వారా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడినట్లయింది.






