- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan kalyan: మధురై చేరుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan) ఇవాళ తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan) ఇవాళ తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధురై చేరుకున్నారు. ఈ మురుగన్ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్య స్వామి భక్తులు విచ్చేయనున్నారు. ఇక్కడికి యూపీ(Uttar pradesh) సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం రానున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ రోజు(ఆదివారం) మధ్యాహ్నం మధురై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్‌కు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి, రాష్ట్ర నాయకులు అమర్ ప్రసాద్ రెడ్డి , మధురై జిల్లా అధ్యక్షులు మారి చక్రవర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసన్, సీనియర్ రాజకీయ నాయకులు రాధాకృష్ణన్ తదితరులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.






