- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్ విజయానంద్
తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఉదయం శ్రీవారిని ఏపీ(Andhra Pradesh) సీఎస్ విజయానంద్(CS Vijayandh) దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వచ్చే ఉగాది నుంచి P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్స్) విధానం అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ వెల్లడించారు. పి-4 విధానంపై నిన్న(గురువారం) రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులు, వర్చువల్‌గా పాల్గొన్న జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనే(Poverty Eradication) లక్ష్యంగా పి-4 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పది శాతం మంది పేదరికంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నదే పి-4 విధానం ముఖ్య ఆశయమని ఆయన పేర్కొన్నారు.






