- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో చారిత్రాత్మక మైలురాయి అధిగమించిన ఏపీ
ఐగాట్ కర్మయోగి (IGot Karmayogi) డిజిటల్ లెర్నింగ్ పోర్టల్‌లో కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లను (Enrollments) నమోదు చేసిన ఏపీ.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రం పరిపాలనా రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిని (Historic Milestone) అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కర్మయోగి (Mission Karmayogi) కార్యక్రమంలో భాగంగా ఐగాట్ కర్మయోగి (IGot Karmayogi) డిజిటల్ లెర్నింగ్ పోర్టల్‌లో కోటికి పైగా ఎన్‌రోల్‌మెంట్లను (Enrollments) నమోదు చేసింది. తద్వారా దేశంలోనే ఈ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు 4,290 కోర్సుల్లో సుమారు 80 లక్షల కోర్సు పూర్తి చేసిన సర్టిఫికేషన్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (APSDPS) సమర్థవంతమైన పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతోంది.
సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandra Babu Naidu) ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది ప్రభుత్వ ఉద్యోగుల నిరంతర అభ్యాస ప్రక్రియకు నిదర్శనమని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనా దక్షత, నాయకత్వ లక్షణాలపై శిక్షణ పొందడం ద్వారా ఏపీ యంత్రాంగం 'ఫ్యూచర్ రెడీ'గా (Future Ready) మారుతోందని ఆయన పేర్కొన్నారు. కేవలం గణాంకాల పరంగానే కాకుండా ఈ శిక్షణ వల్ల క్షేత్రస్థాయిలో పాలన మరింత సులభతరం అవుతుందన్నారు. తద్వారా పౌర సేవల్లో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్, సామర్థ్య పెంపుదల (Capacity Building) విషయంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు.






