AP: ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి రైతులకు బంపరాఫర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-07 13:04:40  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన సీఆర్డీఏ (CRDA) సమావేశంలో అమరావతి రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

AP: ముగిసిన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి రైతులకు బంపరాఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) సమావేశం ముగిసింది. ఈ భేటీలో ప్రధానం రాజధాని పరిధిలోని రైతులు, భూమి కోల్పోయిన వారి సంక్షేమమే ధ్యేయంగా కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ (Land Pooling) కింద భూములు ఇచ్చిన రైతులకు కౌలు పెంచడంతో పాటు, కొత్తగా ల్యాండ్ పూలింగ్‌లో పాల్గొనే రైతులకు రుణమాఫీ ప్రకటిస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన అన్నదాలతకు ఇచ్చే వార్షిక కౌలు మొత్తాన్ని ప్రభుత్వం భారీగా పెంచింది. జూన్ 2024 నుంచి భూములు ఇచ్చే వారికి ఏడాదికి రూ.40 వేల చొప్పున కౌలు ఇచ్చేందుకు సీఆర్డీఏ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పెంపుదల వారు భూములు ఇచ్చినప్పటి నుంచి పదేళ్ల పాటు వర్తించనుంది.

అయితే, జరీబు భూములకు ఇచ్చే కౌలును రూ.5 వేలు, మెట్ట భూములకు ఇచ్చే కౌలును రూ.3 వేల చొప్పున పెంచేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక గ్రామ కంఠాల్లో భూములు కోల్పోతున్న వారికి కూడా ఊరటనిస్తూ.. వారికి ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా రాజధాని పరిధిలో కొత్తగా ల్యాండ్ పూలింగ్ జరిగే గ్రామాల రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రుణమాఫీ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. కొత్తగా పూలింగ్‌లో భాగస్వాములయ్యే రైతులకు రుణమాఫీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, ఈ ఏడాది జనవరి 6వ తేదీ లోపు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Next Story