- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ మంత్రి పీఏపై లైంగిక ఆరోపణలు.. సీరియస్ అయిన సీఎంఓ
ఏపీలో మంత్రి పీఏపై లైంగిక ఆరోపణలు రాగా.. ఈ విషయంపై సీఎంఓ సీరియస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మంత్రి పీఏపై లైంగిక ఆరోపణలు రాగా.. ఈ విషయంపై సీఎంఓ సీరియస్ అయింది. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద సతీష్ అనే వ్యక్తి అనధికార పీఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతడిని విధుల నుంచి తొలగించాలని మంత్రికి ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సతీష్ విధుల్లో కొనసాగడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మహిళ.. సతీష్ తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. ఈ విషయం సీఎంఓ దృష్టికి చేరడంతో అధికారులు చర్యలు చేపట్టారు. సతీష్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పాటు.. రెండు వైపులా విచారణ చేయాలని కూడా సూచించారు. ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. దీంతో మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.






