- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్సవాలు వైభవంగా జరగాలి.. ప్రభల తీర్థంపై సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో ప్రభల తీర్థం వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : అంబేద్కర్ కోనసీమ జిల్లా జగ్గన్న తోటలో ప్రభల తీర్థం వేడుక ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎక్స్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కోనసీమలోని జరుగుతున్న జగ్గన్నతోట ప్రభల తీర్థం సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 476 సంవత్సరాలుగా ఎంతో ప్రశస్తమైన జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా కల్పించిందని వెల్లడించారు.
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థం సమయంలో లోక కళ్యాణార్థమై ఏకాదశ రుద్రులు ఇక్కడ సమావేశమవుతారని అందరి విశ్వాసం అని పేర్కొన్నారు. దాదాపు 5 లక్షల మంది హాజరయ్యే ఈ వేడుకకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వ పరంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతాయి.. ఉత్సవం వైభవంగా జరగాలని కోరుకుంటూ.. అందరికీ మంచి జరగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.






