Funny Video: CM చంద్రబాబు కుర్చీకి ఎసరుపెట్టిన స్టూడెంట్.. నేరుగా ఆయన ముందే మనసులో మాట బయటపెట్టిందిగా!

by Vennela |   (  Updated:2025-04-12 07:08:37  IST  )

Funny Video: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాల్లో పర్యటించారు.

Funny Video: CM చంద్రబాబు కుర్చీకి ఎసరుపెట్టిన స్టూడెంట్.. నేరుగా ఆయన ముందే మనసులో మాట బయటపెట్టిందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: Funny Video: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. ఆగిరిపల్లిలోని ప్రజావేదికలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఆగిరిపల్లిలో 206 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు సీఎం చెప్పారు. ఇదెలా ఉండగా సీఎం చంద్రబాబు పర్యటనలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సీఎం చంద్రబాబు ఓ ఇంటికి వెళ్లి..అక్కడ ఓ కుటుంబంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఆ కుటుంబంలో ఉన్న పాపను దగ్గరకు పిలిచి పెద్దయ్యాక ఏం అవుతావ్ అంటూ అడిగారు. ఆ చిన్నారి ఒక్క సెకను కూడా ఆలోచించకుండానే సీఎం అవుతాను అంటూ అన్నది. ఆమె సమాధానం విన్న చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఆ పాపను దగ్గరకు తీసుకుని నవ్వుతూ నా కుర్చీకే ఎసరు పెట్టావా..సరే..సీఎం అయిన తర్వాత ప్రజలను చల్లగా చూసుకుంటావా అన్నారు. బాగా చదువులో అని పాపను ఆశీర్వదించారు సీఎం చంద్రబాబు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Next Story