- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మా అమ్మ పడిన కష్టం.. ఎవరికీ రావొద్దనే ఆ స్కీమ్ తెచ్చాం’: చంద్రబాబు ఎమోషనల్
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సామాన్య కుటుంబంలో పుట్టానని అన్నారు. తనకు అన్ని రకాల బాధలు, కష్టాలు తెలుసని చెప్పారు. ‘ముఖ్యంగా మా అమ్మ పడిన కష్టాలను కళ్లారా చూశాను.. మా అమ్మ పడిన కష్టం ఎవరికీ రావొద్దనే దీపం పథకం ప్రారంభించాం’ అని సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. ‘నేను ఈ రోజు సవినయంగా, సగర్వంగా చెబుతున్నా.. కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్దికి అడ్డులేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్. ఇదే ఆల్ టైం రికార్డ్’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతరం స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. కాగా, మొత్తం ఐదు రకాల బస్సుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి స్త్రీశక్తి పథకం అమల్లోకి వస్తుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చని అన్నారు.






