- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravati ప్రజలకు గుడ్ న్యూస్.. 5000 ఎకరాల్లో మరో భారీ ఎయిర్ పోర్ట్..!
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన...

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravti)ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారం(Tamil Nadu Election Campaign)లో పాల్గొన్న ఆయన.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5000 ఎకరాల్లో భారీ అంతర్జాతీయ విమానాశ్రయాని(International Airport)కి శ్రీకారం చుట్టామన్నారు. పొరుగున ఉన్న బెంగళూరు(Bengalur), హైదరాబాద్(Hyderabad) నగరాల్లో ఇప్పటికే 2500 ఎకరాల్లో భారీ ఎయిర్‌పోర్టులు ఉన్నా, పెరుగుతున్న రద్దీ దృష్ట్యా వారు రెండో విమానాశ్రయపై ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. రాబోయే 20-30 ఏళ్లలో విమాన ప్రయాణం ఎంతలా పెరగబోతుందో మనం ఇప్పుడే ఊహించి అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
‘‘పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన కోయంబత్తూరులో కేవలం 500 ఎకరాల్లో విమానాశ్రయం ఉంటే సరిపోతుందని ఇక్కడి పాలకులు అనుకోవడం మీ అభివృద్ధిని అడ్డుకోవడమే. భూసేకరణ విషయంలో వెనకడుగు వేస్తూ, చిన్న ఎయిర్‌పోర్టుతోనే సర్దుకుపోవాలనే ధోరణి సరైంది కాదు. కోయంబత్తూరు గ్లోబల్ హబ్‌గా ఎదగాలంటే అమరావతి తరహాలోనే ఇక్కడ కూడా వేల ఎకరాల్లో విస్తరించిన మెగా ఎయిర్‌పోర్ట్ అత్యవసరం. దూరదృష్టి లేని నాయకత్వం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కుంచించుకుపోకూడదు." అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
గాల్లో మూడు గంటల నరకం.. ప్రాణ భయంతో ప్రయాణికుల హాహాకారాలు, ప్రార్థనలు






