- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ బిర్యానీపై ఏపీ CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ బిర్యానీపై ఏపీ CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ బిర్యానీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం విజయవాడలో మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ బిర్యానీని ప్రపంచ వ్యాప్తంగా తానే ప్రమోట్ చేశానని చెప్పారు. ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్ పోర్ట్ కడితే.. ముస్లింలకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టు కట్టామని తెలిపారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీ వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను కూడా తామే ప్రమోట్ చేశామని చెప్పుకొచ్చారు. ఇవాళ హైదరాబాద్‌లో ముస్లింలు కోటీశ్వరులు అయ్యారంటే టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి పనులే అన్నారు. కాగా, అంతకుముందు తైవాన్ కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారు. పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని తైవాన్ బృందానికి సీఎం తెలిపారు. వీడియో






