చంద్రబాబుకు బర్త్ డే ట్రీట్.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-20 11:39:05  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లల వద్ద బాణసంచా పేల్చి కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

చంద్రబాబుకు బర్త్ డే ట్రీట్.. ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) పుట్టిన రోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు(Telugu Desam Party Office), నేతల ఇళ్లల వద్ద బాణసంచా పేల్చి కేకులు కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. అయితే అనంతపురం జిల్లా(Ananthapur District) తాడిపత్రి(Tadipatri)లో జరుపుకున్న చంద్రబాబు బర్డ్ డే ట్రీట్ వైరల్ గా మారింది.

మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Former MLA and Tadipatri Chairman JC Prabhakar Reddy) స్థానికంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిపారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ఫ్లెక్సీ‌కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మరి పాటకు స్టెప్పులు వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మళ్లీ గెలిచేది ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమే: చంద్రబాబు

Next Story