- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబు... కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీకి (DELHI) పయనం

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) మరోసారి ఢిల్లీకి (DELHI) పయనం కానున్నారు. రేపు ఢిల్లీకి మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. భారత పరిశ్రమల సమాఖ్య ( Confederation of Indian Industry) వార్షిక సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం రేపు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ( Taj Palace) జరగనుంది.
పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై.... ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీకి వెళ్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు నాయుడు... ఈ కార్యక్రమంతో పాటు... కేంద్ర మంత్రులను కూడా కలిసి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు ఇండస్ట్రీయల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులకు కూడా వస్తారని తెలుస్తోంది.






