విద్యా, సాంకేతిక రంగాలపై సీఎం ఫోకస్.. విశాఖ వేదికగా కార్యక్రమాలు

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 27న చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ (AU) వందేళ్ల ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు..

విద్యా, సాంకేతిక రంగాలపై సీఎం ఫోకస్.. విశాఖ వేదికగా కార్యక్రమాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 27న చారిత్రాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయ (AU) వందేళ్ల ఉత్సవాల్లో ఆయన పాల్గొంటారు. శతాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, వర్సిటీ సాధించిన ప్రగతిని కొనియాడటంతో పాటు భవిష్యత్ విద్యా ప్రణాళికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఏయూ ప్రాంగణం ఈ వేడుకల కోసం ఇప్పటికే ముస్తాబైంది.

గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన

రెండో రోజు పర్యటనలో భాగంగా ఏప్రిల్ 28న తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ భారీ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చడమే కాకుండా ఐటీ రంగంలో ఏపీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురానుంది. విద్యా, సాంకేతిక రంగాల కలయికగా సాగనున్న ఈ పర్యటన విశాఖ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Next Story