- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ ఇస్లామీయ పండితుడు కన్నుమూత.. ఏపీ సీఎం దిగ్భ్రాంతి
ప్రముఖ ఇస్లామీయ పండితుడు, పిఖా (ఇస్లామీయ న్యాయ నిపుణుడు), సమాజానికి మార్గదర్శకుడిగా పేరుగాంచిన నెల్లూరు వాసి హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) కన్నుమూశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ ఇస్లామీయ పండితుడు, పిఖా (ఇస్లామీయ న్యాయ నిపుణుడు), సమాజానికి మార్గదర్శకుడిగా పేరుగాంచిన నెల్లూరు వాసి హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఖాసిమీ రషాది (రహిమహుల్లాహ్) కన్నుమూశారు. ఆయన మృతితో ఇస్లామీయ విద్యా రంగానికి, ధార్మిక-సామాజిక సేవలకు తీరని లోటు ఏర్పడిందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. మౌలానా అబ్దుల్ వహాబ్ సాహెబ్ తన జీవితంలో 60 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇస్లామీయ విద్య, ఖుర్ఆన్-హదీస్ బోధనకు, అలాగే జామియా నూరుల్ హుదా మద్రసా సేవలకు అంకితం చేశారు. ఆయన 50 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తబ్లీఘ్-ఎ-జమాత్ అధ్యక్షుడిగా సేవలందించగా, 2008 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జమీయత్-ఉలమా గౌరవ అధ్యక్షుడిగా కొనసాగారు.
అరబీ సాహిత్యం, ఫిఖ్, హదీస్‌తో పాటు ఇతర ఇస్లామీయ శాస్త్రాలలో అపారమైన ప్రావీణ్యం కలిగిన ఆయన, అనేక ఇస్లామీయ విద్యా విభాగాల్లో సంపూర్ణ అవగాహన కలిగిన జయ్యద్ ఆలింగా గుర్తింపు పొందారు. ధార్మిక బోధనలతో పాటు సామాజిక సేవలలోనూ ఆయన విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, మౌలానా అబ్దుల్ వహాబ్ సాహెబ్ మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.






