- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం
అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు..

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) దావోస్(Davos) పర్యటనకు బయల్దేరారు. ఇందులో భాగంగా ఇప్పటికే అమరావతి(Amaravati) నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం అయ్యారు. ఢిల్లీ నుంచి ప్యూరిచ్‌కు చంద్రబాబు వెళ్లనున్నారు. మొత్తం నాలుగు రోజలు పాటు జరగనున్న పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామిక వేత్తలను సీఎం కోరనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షక సదస్సులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ప్రపంచ స్థాయి టెక్, పారిశ్రామికదిగ్గజాలతోనూ ఆయన భేటీ కానున్నారు. టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో సహకారంపై అక్కడి ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు.






