Chandrababu: సీ యూ ఇన్ దావోస్..!

by srinivas |
Chandrababu: సీ యూ ఇన్ దావోస్..!
X

దిశ, వెబ్ డెస్క్: దావోస్(Davos) పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) బయల్దేరి వెళ్లారు. ప్రపంచ ఆర్థిక సమావేశం(World Economic Forum)లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు టీమ్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. అర్ధరాత్రి 1.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు వెళ్లనున్నారు. డబ్ల్యూఈఎఫ్ వ్యాపార దిగ్గజాలతో ఆయన భేటీకానున్నారు. నూతన విధానాలు, రాష్ట్ర అనుకూలతలను సదస్సులో వివరించనున్నారు. అలాగే పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. దావోస్‌లో మొత్తం నాలుగు రోజుల పాటు సీఎం బృందం పర్యటించనుంది.

అయితే దావోస్ పర్యటనకు వెళ్తూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ‘‘ప్రపంచ పెట్టుబడుల మ్యాప్‌లో ఏపీని చేర్చేందుకు మేము రెడీగా ఉన్నాం. దావోస్-క్లోస్టర్స్, స్విట్జర్లాండ్‌లో జరిగే 55వ వార్షిక సమావేశంలో ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నా. దావోస్‌లో కలుద్దాం!.’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Advertisement

Next Story