- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో కీలక సదస్సు.. అమరావతి నుంచి బయల్దేరిన సీఎం
ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయల్దేరి వెళ్లారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) ఢిల్లీ(Delhi) బయల్దేరి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యేందుకు ఆయన అమరావతి(Amaravati) నుంచి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(Union Minister Nirmala Sitharaman)ను సీఎం చంద్రబాబు కలవనున్నారు. సాస్కి, పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరననున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు జరిగే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరుకానున్నారు. అదే రాత్రి ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి చంద్రబాబు నాయుడు పయనం అవుతారు.
Next Story






