ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన సీఎం.. రెండు రోజుల పాటు పర్యటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-22 13:19:34  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు...

ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన సీఎం.. రెండు రోజుల పాటు పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర మంత్రుల(Union Ministers)తో శుక్రవారం భేటీకానున్నారు. ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై మరోసారి కేంద్రం సహకారం కోరనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌(Union Finance Minister Nirmala Sitharaman)తో పాటు మరికొంతమంది కేంద్రమంత్రులను సైతం ఆయన కలువనున్నారు. రాష్ట్రంలో ఉన్న లోటు బడ్జెట్‌తో పాటు వివిధ పథకాలకు కావాల్సిన నిధుల అవసరాలను వారికి వివరించనున్నారు. ఇప్పటికే ఏపీ రాజధా అమరావతి(Amaravati)కి కేంద్రం సహరిస్తున్నందున ఆయన కృతజ్ఞతలు తెలపనున్నారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరనున్నారు. ఈ మేరకు ఆయన దేశ రాజధానిలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 24న ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలకమండలి(NITI Aayog Governing Council) సమావేశంలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Next Story