అయోధ్యకు చంద్రబాబు.. కాసేపట్లో..!

by Vemula.Srinu Prasad |

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయోధ్యలో పర్యటిస్తున్నారు. ...

అయోధ్యకు చంద్రబాబు.. కాసేపట్లో..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) అయోధ్య(Ayodya)లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అక్కడి చేరుకున్న ఆయన మరికాసేపట్లో బాలరాముడి(Balaramudu)ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబును అక్కడి అధికారులు ఘనంగా స్వాగతించారు. అయోధ్య బాలరాముడి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. బాలరాముడి దర్శనం తర్వాత సీఎం చంద్రబాబు నాయుడికి అక్కడి విశిష్టతలను వివరించి బాలరాముడి విగ్రహాన్ని బహూకరించనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులను చంద్రబాబు కలుస్తారని తెలుస్తోంది. ఇక ఏపీలో అనుసరిస్తున్న విధానలను వారికి సీఎం చంద్రబాబు వివరించానున్నారు. పర్యటన అనంతరం గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు.

Next Story