- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
75వ వసంతంలోకి సీఎం చంద్రబాబు.. కుటుంబంతో కలిసి విదేశాల్లో సెలబ్రేషన్స్

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) ఈ నెల 20వ తారీకుతో 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 20, 1950లో చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో ఆయన జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 164 సీట్లతో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 20న ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని టీడీపీ శ్రేణులు(TDP Followers) ఏర్పాట్లు చేస్తున్నాయి.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్తున్నారు. ఈ నెల 17వ తేదీనే ఆయన విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన 75వ వజ్రోత్సవ జన్మదినోత్సవాన్ని అక్కడే జరుపుకోనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పుట్టిన రోజు వేడుకలు పూర్తి అయిన తర్వాత తిరిగి అమరావతి(Amaravati) రానున్నారు. నిత్యం బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల పాటు విదేశాల్లో గడపనున్నారు.
Also Read..