- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో కీలక మీటింగ్.. బయల్దేరిన సీఎం చంద్రబాబు
by Vemula.Srinu Prasad |
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు. టీడీపీ మహానాడు(Tdp Mahanadu) ముగిసిన వెంటనే కడప ఎయిర్ పోర్టు(Kadapa Airport) నుంచి నేరుగా ఢిల్లీ(Delhi)కి బయల్దేరారు. దేశ రాజధాని(Capital)లో శుక్రవారం జరగనున్న సీఐఐ సదస్సు(CII Conference)లో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం రాత్రికి అక్కడే బస చేసి శనివారం మధ్యాహ్నం రాజమండ్రి(Rajahmundry)కి వెళ్తారు. గున్నేపల్లి(Gunnepalli)లో పెన్షన్(Pension) పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. జూన్ 1న ఆదివారం కావడంతో ఒక రోజు ముందే పెన్షన్ లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఆతర్వాత గ్రామస్తులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఢిల్లీ, రాజమండ్రి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
Next Story






