- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి పండగ పూట బిగ్ రిలీఫ్ దక్కింది

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu)కి పండగ పూట బిగ్ రిలీఫ్(Big Relief)) దక్కింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు(Skill Devolepment Scam Case)లో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు భారీ ఊరట లభించింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని సీఐడీ కేసు
కాగా గత 2014-19 హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడపై 2023లో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. దాదాపు 53 రోజులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారాయన. అనంతరం అనారోగ్య కారణాల దృష్ట్యా జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.






