- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీడియాపై దాడులేంటి?.. మహా న్యూస్ ఆఫీస్‌పై BRS దాడిని ఖండించిన CM చంద్రబాబు
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశంలో బీఆర్ఎస్(KTR) నేత కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) అంశంలో బీఆర్ఎస్(KTR) నేత కేటీఆర్‌పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు శనివారం మహాన్యూస్ కార్యాలయంపై దాడికి దిగిన విషయం తెలిసిందే. మహాన్యూస్ కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ను, స్టూడియోను ధ్వంసం చేశారు. ఆఫీసుకు లోపలికి ప్రవేశించిన బీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఫీస్ ముందున్న పలు కార్లను కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మహాన్యూస్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తే.. వారిపైనా దాడికి దిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ దాడిపై ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) స్పందించారు. మహా న్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఖండించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని మహాన్యూస్ ఛానల్ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని.. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సీఎం చంద్రబాబు సంఘీభావం ప్రకటించారు.
Read More.. ‘ఆ ఘటన పై చర్యలు తీసుకోవాలి’.. తెలంగాణ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి గానే పరిగణించాలి: మంత్రి లోకేష్






